అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఇది ధర్మమేనా అని వైసీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘అప్పు రూ.14 లక్షల కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పారు. చివరికి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని తెలిపారు.
కాగ్ రిపోర్టు కూడా అదే వెల్లడించింది. అయినా సరే మళ్లీ బుకాయిస్తూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను వ్యవస్థీకృతం చేశారు’ అని జగన్ మండిపడ్డారు.