ఈ నెల29న సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు.
ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు..
మహిళా విద్యార్థి, యువత ఇతర గ్రామ స్థాయి అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు…