గుండెపోటు రావడానికి ముందు కన్పించే లక్షణాలు ఇవే..?
సహజంగా గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని అందరూ భావిస్తారు.. కానీ గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.
గుండెపోటుకు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట.
తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.
దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కడుపులో తిప్పడం, అరగనట్టు ఉండటం వంటివి కూడా గుండెపోటుకు నెల రోజుల ముందు నుంచే ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి.
కొందరిలో అతిగా చెమటపోయడం కూడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్‌కు ముందు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా నొప్పి అనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. వీపు, భుజాలు, చేతులు, మెడ, దవడ వంటి చోట్ల నొప్పి అనిపిస్తుందని అంటున్నారు.