టీ20 సిరీస్ మాదే
టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు.
మాజట్టులో యువక్రికెటర్లు ఉన్నారు.. వారంతా భారత్ పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్ కు మేము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాము.
దూకుడుగా ఆడాలని భావిస్తున్నాము. సిరీస్ గెలుపొందేందుకు మేము సర్వశక్తులను ఒడ్డుతాము. టీ20 ల్లో ఆ రోజు ఎవరూ బాగా ఆడితే వారిదే విజయం అని నజ్మూల్ తెలిపారు.