తప్పు జరిగితే వేటు తప్పదు…?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. ఇండ్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు. ఏవిధమైన అవినీతి ఉండకూడదు. ఈ పథకంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగిన వేటు తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
మంగళవారం హిమాయత్ నగర్ లో గృహా నిర్మాణ సంస్థ కార్యాలయంలో సంబంధితాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందాలి.
అధికారులు సైతం ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. ఏ ఒక్క అధికారిపైనా తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. కోపతాపాలు అసలు లేవు. కేవలం తమ ప్రభుత్వం తీసుకోచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన వారికే లబ్ధి జరగాలనే ఆరాటం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఈ పథకంలో ఎలాంటి ఒత్తిడిలకు లోంగకుండా తమ పని తాము చేయాలని కోరారు.