పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ
పెళ్లి పీటలు ఎక్కిన హీరోయిన్ తాప్సీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సొట్టబుగ్గల సుందరి..హాట్ భామ తాప్సీ పెళ్లి పీటలు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి..ఈ క్రమంలో హీరోయిన్ తాప్సీ గత పదేండ్లుగా డేటింగ్ తో పాటు ప్రేమలో మునిగిఉన్న తన ప్రియుడైన మథియాస్ బోను అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆ వార్తల ప్రధాన సారాంశం. ఈనెల 23న ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది తన సన్నిహితుల సమక్షంలో వీరివురి వివాహం జరిగినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఈ వివాహా వేడుకలకు బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు హాజరైనట్లు తెలుస్తోంది.