పెళ్లి పేరుతో అత్యాచారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.నగరంలోని మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యూసుప్ గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయి ఈశ్వర్ ఓ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయసాగాడు ..దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై కేసు నమోదైంది