మీరు రోజూ ఫౌడర్ రాసుకుంటున్నారా..?
మీరు రోజూ ఫౌడర్ రాసుకుంటున్నారా..?. ముఖానికి మేకప్ లేనిది బయటకు వెళ్లరా..?.. అయితే ఇది మీకోసమే.. మీరు పక్కగా తెల్సుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.. అది ఏమిటంటే..?.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కాన్సర్ (ఐఏసీఆర్) కీలక ప్రకటన చేసింది. పౌడర్ వినియోగానికి అండాశయ క్యాన్సర్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
క్యాన్సర్ వచ్చే అవకాశాలు, పౌడర్‌కు మధ్య సంబంధంపై ఓ అధ్యయనం తరువాత ఈ అంచనాకు వచ్చింది.ప్రకృతి సిద్ధంగా లభించే మినరల్ టాల్క్. దీన్ని పౌడర్ల తయారీలో అధికంగా వినియోగిస్తారు. బేబీ పౌడర్లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో దీన్ని వాడతారు.
అయితే, టాల్క్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగంగా వ్యక్తులు టాల్క్ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారని పేర్కొంది. అయితే, టాల్క్‌తో క్యాన్సర్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మాత్రమే ఐఏఆర్‌సీ పేర్కొందని యూకే ఓపెన్ యూనివర్సిటీకి చెందిన గణాంక శాస్త్రవేత్త కెవిన్ మెకాన్వే పేర్కొన్నారు