పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేడాది మార్చి నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది.
మార్చి ఇరవై ఒక్కటి తారీఖు నుండి ఏఫ్రిల్ నాలుగో తారీఖు వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, మార్చి 26న గణితం, మార్చి 28న ఫిజిక్స్ , మార్చి 29న బయోలజీ, ఏఫ్రిల్ 4న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.