13నెలల్లో రూ.1,80,000కోట్లు..!

తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..మీడియాతో ఆయన మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు.
హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు రాకుండా చేయాలని అనేకమంది చాలా కుట్రలు చేశారు.ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు.కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు.
పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి..కేవలం13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి.సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాము..స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామం అని” అన్నారు..
