2024: హీరోలు ఎవరూ..? జీరోలు ఎవరూ…?
కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు…పదేండ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన తొలి సీఎం.. అలాంటి కేసీఆర్ కు 2024 కల్సిరాలేదని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీరో కి పరిమితమైంది.. దాదాపు పదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ కు తనకు అడ్డే లేదనుకున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు.
దీనికి కారణం కేసీఆర్ ప్రజలకు ఇటు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరనే ప్రచారం.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో పాటు ప్రజల్లో స్థానిక నాయకత్వం.. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండటం లాంటి పలు కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితం అయింది బీఆర్ఎస్..దీంతో ఈ ఎన్నికల్లో అసలు ఫ్యూచరే లేదనుకున్న.. అధికారం కాదు కానీ యాబై స్థానాలు వస్తాయని కలలు కన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే కాదు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు వచ్చాయి.. ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు వచ్చాయి..జీరో కాస్త హీరో అయ్యాడు రేవంత్ రెడ్డి.
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చెప్పిన నినాదం వైనాట్ 175. ఆ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఏపీ ఓటర్లు. మంత్రులపై తీవ్ర వ్యతిరేకత.. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు లాంటి కారణాలతో ఏపీలో విభిన్న ఫలితాలు వెలువడ్డాయి. ఇక పనే అయిపోయిందనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడటానికి ఢిల్లీకెళ్లి మరి బీజేపీ పెద్దలను ఒప్పించిన దగ్గర నుండి సీట్ల పంపకం వరకు తీసుకున్న వినూత్న నిర్ణయాల వల్ల కూటమి ప్రభుత్వం నూట అరవై రెండు స్థానాలను దక్కించుకుంది.
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇక జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడు.. టీడీపీ కి మళ్లీ అధికారం దక్కదు అని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. పడిన కెరటం లేవడానికే అన్నట్లు టీడీపీ ఘనవిజయం సాధించింది.2024లో హీరోలైన కేసీఆర్.. జగన్ మోహాన్ రెడ్డి జీరోలుగా మారారు.. జీరోలైన చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్.. రేవంత్ రెడ్డి హీరోలుగా అవతారమెత్తారు.