3 బాల్స్ …140 కోట్ల మంది..నితీష్ కుమార్..!

 3 బాల్స్ …140 కోట్ల మంది..నితీష్ కుమార్..!

మెల్ బోర్న్ వేదికగా ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి శతకం సాధించిన సంగతి తెల్సిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు లాస్ట్ సెషన్ లో కొత్త ఓవర్ మొదలైంది. నితీష్ కుమార్ రెడ్డి 97 పరుగుల మీద ఉన్నాడు. మొదటి 5 బాల్స్ కి ఒక్క రన్ కూడా రాలేదు.రెండో పక్క బుమ్ర అంటే 8 వికెట్లు పడిపోయాయి .

ఉన్నది నితీష్,బుమృా,సిరాజ్,ఆస్ట్రేలియా నితీష్ ను సెంచరీ చేయకుండా ఆపాలి.. అతనిని ఒక ఎండ్ లో పెట్టీ మిగతా రెండు వికెట్లు పీకెయ్యాలి .ఆరో బాల్ కి సింగిల్ తీసి మళ్ళా బ్యాటింగ్ రావాలి నితీష్ కుమార్ రెడ్డి .పొరపాటు ఎవరు పడ్డారో లేక ఆస్ట్రేలియా ఉచ్చు లో పడ్డారో తెలియదు. రెండు రన్ లు తీసేసారు అంటే తరువాతి ఓవర్ బుమ్ర ఆడాలి అనడం కన్నా బ్రతికి బట్ట కట్టాలి. అంతే టెన్షన్ మొదలైంది.

స్టేడియం లో నితీష్ ఫాదర్ నీ కెమెరా పదే పదే చూపిస్తోంది అతను చేతులు జోడించి దైవాన్ని మొక్కుతున్నాడు ,అందరి కళ్లు బమ్రా మీద రెండు బాల్స్ ఏదో ఆ డే డు అనడం కన్నా బ్రతికి బట్ట కట్టేడు మూడో బాల్ కి జరగాల్సన ఘోరం జరిగి పోయింది బుమ్రా ఔట్ అయ్యాడు.అప్పుడు వచ్చేడు హైదరాబాదీ మొహ్మద్ సిరాజ్ మూడు బాల్స్ ఆడాలి లేదా ఓ సింగిల్ తియ్యాలి.ఆ మూడు బాల్స్ అతను ఆడగలిగితే నితీష్ కి సెంచరీ చేసే ఛాన్స్ లేదా 99 నాట్ అవుట్ ..దేశ ప్రజలు మొత్తం కళ్ళు తెరిచి చూసిన ఆ మూడు బాల్స్ ఈ మ్యాచ్ లో ఇప్పటి దాకా సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఔట్ అయితే అదో విమర్శ . దేవుళ్లంతా 140 కోట్ల మంది ప్రాధనలు విన్నారు వారికి ఇన్ని కోట్ల మంది భారతీయులను అసంతృప్తి లో ముంచడం ఇష్టం లేదు అందుకే సిరాజ్ మూడు బాల్స్ లో బ్రతికి బట్ట కట్టేడు ,దేశం ఊపిరి పీల్చుకుంది.

నితీష్ తరువాతి ఓవర్ మొదటి బాల్ లో సెంచరీ పూర్తి చేశాడు , ఇదే ఒక సంపూర్ణ ఆనందం 140 కోట్ల మంది ఇండియా లో ఇంకో 2 కోట్ల మంది ప్రపంచ ఇతర దేశాల్లో ఉన్న మన వారు కోరుకొన్న ఆనందం ఈ ఆనందం ముందు ఏది పనికి వస్తుంది ?.నితీష్ రెడ్డి తండ్రి ఆనంద బాష్పాలు కార్చేడు,దేశం పులకరించింది, తెలుగు రాష్ట్రాలు ఈ రోజు పండగ చేసుకొంటాయి, ఒక తెలుగు రాష్ట్ర కుర్రోడు సహాయం తో ఇంకో తెలుగు రాష్ట్ర కుర్రోడు క్రికెట్ జీవితం లో మొదటి సెంచరీ చేశాడు.మొత్తం టీం ,సపోర్ట్ టీం తో సహా బౌండరీ లైన్ వద్ద వీరిద్దరికీ అభివాదాలు చేస్తూ పెవిలియన్ లోకి నితీష్ కుమార్ రెడ్డి నీ, సిరాజ్ ను స్వాగతం పలికారు.. ఇదో అరుదైన సంఘటన.

-By Rama Bhaskar Devarakonda 

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *