లోక్ సభ ఎన్నికలు-కాంగ్రెస్ కు 300..బీజేపీకి 200సీట్లు
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
తమ కూటమి యొక్క సమర్ధవంతమైన నాయకత్వం… పదేండ్లలో బీజేపీ సర్కారు..మోదీ నాయకత్వంపై దేశ ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తమకు లబ్ధి చేకూరుస్తుంది అని డీకే తెలిపారు. చూడాలి మరి ఈ దేశ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో..?