రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం
కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు..
మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు..
ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ కి అప్పిగిస్తాము.. దీని నిర్మాణం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.