కేటీఆర్ కేసు..ఏసీబి సీక్రెట్ రిపోర్ట్..?

KTRA won this “race” of Formula E.?. All day..?
తెలంగాణలో పార్ములా ఈ కేసు సంచలనంగా మారింది.విదేశి సంస్థలకు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డబ్బులు పంపారని,ప్రభుత్వ దనాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగాలతో కేటీఆర్ పై కేసు నమోదైంది.ఏసీబీ ఈ కేసు విచారణ ప్రారంభించింది.గత 20 రోజులుగా కేటీఆర్ అరెస్ట్ నేడు,రేపు అంటూ చర్చలకు తెరలేపారు..అసలు ఈ కేసులో ఏమీ లేదు,డబ్బులు పంపింది నిజం,వాళ్ళకు చేరిందని వాళ్ళూ చెబుతున్నారు.హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే తాము ఈ రేసింగ్ నిర్వహించినట్టు కేటీఆర్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.ఏసీబీ విచారణకు సైతం హాజరయ్యి కాన్ఫిడెంట్ గా ఇంటికి చేరుకున్నారు..
ఇదంతా ఇలా ఉంటే ఏసీబీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీక్రెట్ నివేదిక అందజేసిందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.కేటీఆర్ అరెస్ట్ కుదరదంటూ సంచలన నివేదికను ఏసీబీ రేవంత్ రెడ్డికి అందజేసిందట.అరెస్ట్ చేసేంత బలమైన అంశాలు ఈ కేసులో లేవని ఏసీబీ నివేదికలో తెలిపినట్టు సమాచారం.హైదరాబాద్ కోసమే ఫార్ములా ఈ రేసు జరిపినట్టు కేటీఆర్ బల్లా గుద్ది చెప్పడం,ప్రజల్లోనూ అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే జరిగిందనే వాదన ఉందని,కేటీఆర్ ఇచ్చిన సమాదానాలలోను స్పష్టత ఉంది..
అసలు ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయడం వృదా ప్రయాస అని తెలిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..హైదరాబాద్ ఇమేజ్ విశ్వవ్యాప్తం చేసిన ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికే మాయని మచ్చగా మారుతుందని ఏసీబీ రిపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది.అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గి సైలెంట్ అయినట్టు తెలుస్తుంది..రేవంత్ రెడ్డికి ఏసీబీ ఇచ్చిన ఈ సీక్రెట్ రిపోర్ట్ సంచలనంగా మారిందని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..
