పోలీసుల పై అక్బరుద్దిన్ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ హైదరాబాద్ నగర పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో పద్దుల గురించి జరిగిన చర్చలో అయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయని ” సంచలన ఆరోపణలు చేశారు.
అయన ఇంకా మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక ఏసీపీ ఫోన్ చేసి మా ఏరియాలో పోలీస్ స్టేషన్ను నిర్మించేందుకు నన్ను సాయం చేయమన్నారు.
నెల నెల మీరు తీసుకున్న లంచాలతో మీరే సొంతంగా పోలీస్ స్టేషన్ నిర్మించుకోండని ఆయనకు సలహా ఇచ్చా’ అని అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సందర్భంగా చెప్పారు.