అల్లు అర్జున్ విడుదల..!
చంచల్ గూడ జైలు నుండి ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు శనివారం ఉదయం విడుదలయ్యారు. నిన్న శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే.
ఆ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు బన్నీని వెనక గేటు నుండి పంపించారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన సంఘటనలో బన్నీని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
నాంపల్లి కోర్టులో హాజరు పరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ ను విధించింది. అరెస్ట్ పై బన్నీ తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.