అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్
ప్రముఖ యువనటి అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్ కు స్వీకారం చుట్టారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పొట్టేల్ మూవీ కోసం నటి నాగళ్ల వినూత్న ప్రచారానికి నడుంబిగించారు.
ఏకంగా తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో తమ మూవీ కు సంబంధించిన కరపత్రాలను ప్రయాణికులకు అందజేశారు.అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలను అనన్య నాగళ్ల తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.
ఆడా చేస్తాం. ఈడా చేస్తాం.. యాడైనా చేస్తాం అంటూ దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. యువచంద్ర,అనన్య జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.