అనన్య నాగళ్ల ఆవేదన..! ఎందుకంటే…?
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువనటి. చక్కని అందం.. యువత దగ్గర నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల వారిని మెప్పించే అభినయం కలగల్సిన అందాల రాక్షసి . అలాంటి అనన్య నాగళ్ల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తీవ్ర మనోఆవేదన చెందిందంట. తాను నటించిన పోట్టెల్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఈ ముద్దుగుమ్మ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ హాట్ బ్యూటీ పాల్గోన్నారు.
ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ కాస్టింగ్ కౌచ్ గురించి అనన్య నాగళ్లను అడిగేశారు. దీంతో ఆ ఒక్క ప్రశ్న యావత్ అనన్య కుటుంబాన్ని ఆలోచనలో పడేసిందంట. తాను ఏ సినిమా షూటింగ్ కైన.. సినిమా వాళ్ల దగ్గరకు సమావేశాలకు వెళ్లే ముందు ఇంట్లో మా అమ్మకు ఏమి కాదు.. కాస్టింగ్ కౌచ్ లాంటివి నాకు ఎదురు కావు.. ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పి మరి ఈ స్థాయికి ఎదిగాను. తాజాగా ఆ ప్రశ్నతో మొత్తం కుటుంబమే ఆలోచనలో పడింది. త్వరలో నా బ్రదర్ పెళ్ళి కూడా ఉంది.
వాళ్లు వీళ్లు ఎలా అనుకుంటారో అని మావోళ్లు భయపడ్దారు. చాలా మంది నాకు వ్యక్తిగతంగా కాల్స్ చేసి మనోధైర్యం చెప్పారు. సినిమావాళ్లను అలాంటి ప్రశ్నలడగటం సర్వసాధారణమే. నువ్వేమి కంగారు పడోద్దు అని చెప్పారు. ఆ ప్రశ్న వేసిన జర్నలిస్ట్ నాకు కాల్ చేసి క్షమాపణలు కోరారు. అందుకే నేను చెప్పేది ఏమంటే ఎవర్ని అయిన ఏదైన ప్రశ్న అడిగేముందు ఆలోచించాలి.. లేకపోతే ఇలా అందరూ బాధపడాల్సి వస్తుంది అని తన ఆవేదన వెనక ఉన్న కారణాన్ని ఈ ముద్దుగుమ్మ తెలిపారు.