కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతుంది.. మాజీ మంత్రి..మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే..
తాజాగా ఆ సంఘటనను మరిచిపోకముందే జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.