కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…?
కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా మరో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి …
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అని టాక్.
ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కల్సిన నేపథ్యంలో తాజాగా రేపు శుక్రవారం అయన సమక్షంలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనున్నారు…