నిన్న భవానీ..నేడు ప్రవీణ్..
నల్లగొండ – శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించారు.
రెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు.ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి.
భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?’ అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు.తనతో మంచిగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్ఐ చెప్పినట్లు ఎస్పీ ఎదుట సదరు మహిళ బోరున విలపించారు.
అతను చెప్పినట్లు చేయకపోవడంతో తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు.