తెలంగాణలో మరో కొత్త పథకం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.