కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ మరో ట్వీట్
వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో నాగార్జున, నాగ చైతన్యలను. కానీ మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పింది మాత్రం సమంతకు.
ఐన్ స్టీన్ కూడా ఈ ఈక్వెషన్ ను పరిష్కరించలేడేమో అని నాకు డౌటానుమానం ఉంది అని రామ్ గోపాల్ వర్మ తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. అయితే అంతకుముందే మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతను పొగిడారని కామెంట్ కూడా చేశారు.