అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!
ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?.
పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల కోట్లకు పైగా ఒప్పందాలను చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్ధు చేయాల్సింది వందకోట్ల రూపాయలను కాదు.
అదానీతో చేసుకున్న పన్నెండు వేల కోట్లకు పైగా ఒప్పందాలను అని ఆయన డిమాండ్ చేశారు. మూసీని మురికికూపంగా మారుస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీతో ఒప్పందాలను రద్ధు చేసుకోవాలని ఆయన సూచించారు.