రేపు ఏపీ క్యాబినేట్ భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ మంత్రి వర్గం రేపు గురువారం మధ్యాహ్నాం రెండున్నర గంటలకు సమావేశం కానున్నది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఈరోజు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రులు,సంబంధిత శాఖల కార్యదర్శులు,ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్న పలు అంశాల గురించి బాబు వారికి దిశానిర్ధేశం చేయనున్నారు.
నిన్న కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి అన్ని విధాలుగా అండగా ఉంటాము. వైజాగ్ స్టీల్ కు ఎనిమిది వందల కోట్లు కేటాయించింది. వీటిపై కూడా చర్చించే అవకాశం ఉందని టాక్