మంత్రి పొంగులేటికి ఏపీ సర్కారు షాక్
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194కోట్ల టెండర్లను దక్కించుకుంది.
అయితే టెండర్ దక్కించుకున్న కానీ ఇంతవరకు రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ మొదలెట్టలేదు.. దాదాపు ఏడాదిగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఏపీఈపీడీసీఎల్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది.
నెల రోజుల్లో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని ఈ సదర్భంగా హెచ్చరించింది. అయితే కేంద్రం విధించిన గడవులోపు పనులు పూర్తి కాకపోతే కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు ఆగిపోతాయని ఈ సందర్భంగా అధికారులు ప్రభుత్వానికి సూచించారు.