గుడ్డు తింటున్నారా..?

సహాజంగా ఈరోజుల్లో చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతోనే కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు.
అయితే గుడ్డు లోపల ఉండే పచ్చసోనను తింటే అనేక ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.. గుడ్డు లోపల ఉండే పచ్చసోనలో A, D, E, B12, K, B2, B9 విటమిన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. చర్మం ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. అందుకే రోజుకు ఒకటి చొప్పున తినాలని వాళ్లు చెబుతున్నారు.
