సోషల్ మీడియా క్రేజ్ కేవలం పాల పొంగులాంటిదేనా?

సోషల్ మీడియా క్రేజ్ కేవలం పాల పొంగులాంటిదేనా? ఇంతకుముందు జరిగిన హడావిడి చూస్తే అలాగే అనిపిస్తుంది… ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అవ్వడం, పేరున్న సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ఆ సోషల్ మీడియా స్టార్లకు ఆఫర్స్ ఇస్తున్నామంటూ ఊదరగొట్టడం, cut చేస్తే నెలరోజుల తర్వాత ఎవరూ పట్టించుకోక పోవడం….
ఇప్పుడు మోనాలిసా వంతు వచ్చిందేమో అనిపిస్తుంది… పాపం, అభం శుభం తెలియని 16 ఏళ్ల పేద పిల్ల… తన అందం తనకి అదృష్టం అనుకోవాలో లేక శాపం అనుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఈ నాలుగు రోజులుగా మొత్తం నేషనల్ మీడియా ఫోకస్ చూస్తుంటే….
మోనాలిసా పాపకి సినిమా అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయ్, సంతోషం.. కానీ అది ఎంతవరకూ సఫలం అవుతుందో చెప్పలేం… ఇప్పుడు క్రేజ్ వచ్చింది కాబట్టి ప్రతీ ఒక్కరూ ఆమె చుట్టూ మూగుతున్నారు, కొన్నిరోజులు పోగానే ఇవేమీ ఉండవేమో…. సినిమా అవకాశాలు అంటూ ఆశ పెట్టి ఆ అమ్మాయిని నడి రోడ్డులో వదిలేస్తారో లేక ఆ అమ్మాయిని ఒక స్టార్ హీరోయిన్ని చేస్తారో కాలమే నిర్ణయించాలి…
ఇప్పుడు ఆ అమ్మాయికి 16 ఏళ్ళే కాబట్టి ఎవరైనా ప్రోత్సహిస్తే ఓ రెండేళ్లు యాక్టింగ్ నేర్చుకున్నా తర్వాత మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ పోటీ ప్రపంచంలో అది సాధ్యమేనా ఆ పేద పిల్లకి….
ప్రియాంక చోప్రా, కంగనా రానౌత్ నటించిన “ఫ్యాషన్ ” సినిమా చూసాంగా.. అందమైన రంగుల ప్రపంచంలో ఎన్ని రాజకీయాలు, కుతంత్రాలు ఉంటాయో…. అవన్నీ ఈ పిల్లకు సాధ్యమయ్యే పనేనా…!
