రికార్డుకెక్కిన ఒవైసీ
తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు.
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ ఎంపీలుగా గెలుపొందారు.
మిగిలిన ఎనిమిది మంది ఈటల రాజేందర్,కడియం కావ్య,రామసహయం రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,గడ్డం వంశీ,రఘువీర్, తదితరులు తొలిసారి గెలుపొంది లోక్ సభలోకి అడుగు పెట్టారు..