శోకనగర్ గా ఆశోక్ నగర్..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు.
ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. ఆరు గ్యారంటీల ఊసే లేదు.
పండుగ పెళ్ళిళ్ల సీజనలో సైతం 144 సెక్షన్ విధించి నిరంకుశ పాలనను సాగిస్తున్నారు. విద్యార్థులు, యువత వీపులు కమిలిపోయేలా కొట్టారు. ఆశోక్ నగర్ ను శోక నగర్ గా మార్చారని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దుయ్యబట్టారు.