రోహిత్ విధ్వంసం -టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.