అడిగింది 10వేలు.. ఇచ్చింది 400

 అడిగింది 10వేలు.. ఇచ్చింది 400

Revanth Reddy

కేంద్రంలో నరేందర్ మోదీ ప్రభుత్వం ఇటీవల వరదలకు గురైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా ఇటీవల వరదలతో నష్టపోయిన 14 రాష్ట్రాలకు రూ.5,858.6 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లను అందించింది.

అయితే ఈ నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు దక్కాయి. గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌కు రూ.189 కోట్లు, కేరళకు రూ.145 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, నాగాలాండ్‌కు రూ.25 కోట్లు వచ్చాయి. గత నెలలో భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించి, ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేశారని కేంద్రం పేర్కొంది. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వాధికారులకు సమర్పించిన నివేదికల్లో… సాక్షాత్తు కేంద్రమంత్రులకు ఇచ్చిన నివేదికల్లో పదివేల కోట్ల వరకు వరద నష్టం జరిగింది అని అంచనాలను అందజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అడిగింది పదివేల కోట్లు అయితే ఇచ్చింది మాత్రం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *