అధికారులపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలోని ప్రభుత్వ అధికారులనుద్దేశించి మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి.
ఓ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘”రేపటి నుంచి టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్ల పెట్టుకొని ఎస్సై, ఎమ్మార్వో, ఎండీవో, ఏ ఆఫీస్కు వెళ్లినా కుర్చీ వేసి కూర్చోబెడతారు”‘.
మీకు టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతాను. ఒకరో ఇద్దరో నా మాట వినకపోతే ఏమవుతారో వారికి నేను చెప్పాల్సిన అవసరంలేదు’ అని ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.