బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై టమాటాలతో దాడి.!

Attack on BRS MLA with tomatoes!
బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజుర్ బాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు టమాటాలతో దాడికి దిగిన సంఘటన చోటు చేస్కుంది.
నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి..?. గతంలో ఆరు గ్యారంటీలతో పేరుతో దరఖాస్తులు తీస్సుకున్నారు.
అవి ఏమయ్యాయి..?. అని అక్కడకోచ్చిన అధికారులను ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో కోపద్రిక్తులైన కాంగ్రెస్ శ్రేణులు టమాటాలతో ఎమ్మెల్యేపై దాడికి దిగారు. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు.
