ప్రేమ వ్యవహారంతో డిగ్రీ విద్యార్థిపై దాడి
ప్రేమ వ్యవహారంలో డిగ్రీ విద్యార్థిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేసి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది..
రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం – పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అల్లూరి విష్ణు(22)పై కొంత మంది ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడి, సొమ్మసిల్లి పడిపోయిన విష్ణును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. అయితే విష్ణు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.