Slider Telangana

మల్కాజిగిరిలో ఈటల చరిత్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్  ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More

Slider Telangana

Live Update:- తెలంగాణలో ఎవరూ ఎక్కడ ఆధిక్యం?

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 17పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ ఏడు స్థానాల్లో నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్,చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ), సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి జి నగేశ్, మల్కాజిగిరి నుండి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో జహీరాబాద్  నుండి షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, వరంగల్ నుండికావ్య, […]Read More

Andhra Pradesh Slider

మంత్రి రోజాకు బిగ్ షాక్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి […]Read More

Andhra Pradesh Slider

పిఠాపురంలో పవన్ దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న175అసెంబ్లీ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలైన పోస్టల్ ఓట్ల లెక్కింపులో 1000ఓట్లతో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై లీడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Slider Telangana

మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న బీజేపీ

దేశ వ్యాప్తంగా ఈ రోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ […]Read More

Slider Telangana

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో బీజేపీ

తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More

Andhra Pradesh Slider

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో టీడీపీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్న సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న175స్థానాల్లో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుతో ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరట్ల బుచ్చయ్య చౌదరి 910ఓట్ల మెజార్టీతో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈవీఎం తొలి రౌండ్ […]Read More

National Slider

లోక్ సభ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ

ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Slider Telangana

MLC కవితకు షాక్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More

Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావును కలిసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ 108ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. దీంతో ఈరోజు సాయంత్రం ఆయన మాజీ మంత్రి హారీష్ రావును కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల రోజున మహబూబ్ నగర్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి […]Read More