సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు.
విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.