ఏపీని పసుమయం చేయడానికి బాబు సరికొత్త ప్లాన్..?
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి గెలుపుతో టీడీపీ బాస్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రమంతటా పసుపుమయం చేయాలని తెగ ఆరాటపడ్డారు. అనుకున్నదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు స్థానిక సంస్థల చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను తమ కూటమి వైపు లాక్కోవాలని చూశారు.
కానీ ఒకటి అరా తప్పా ఎవరూ ముందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే మెజార్టీ సాధించిన పసుపు పార్టీ స్థానికంగా కూడా తామే ఉండాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. ఈ నిర్ణయంలో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకోచ్చిన ఓ చట్టాన్ని సవరణ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్థానిక సంస్థల్లో.. జెడ్పీ లలో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని నాలుగేండ్లకు పెంచారు.
కానీ చంద్రబాబు తాజాగా ఆ గడవును రెండేండ్లకే కుదిస్తూ సరికొత్త చట్టాన్ని తీసుకోచ్చారు. దీంతో స్థానికంగా కూడా తమ కూటమి పార్టీలకు చెందిన నేతలే ఉంటారని బాబు ఇలా ఆలోచించారు అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ చట్టంతో బాబు త్వరలో ఏపీని పసుపుమయం చేయాలని కంటున్న కలలు నిజమవుతాయో..? కలలుగానే మిగులుతాయో…?