బాలయ్య మంచోడు- హీరోయిన్ క్లీన్ చిట్
నందమూరి బాలకృష్ణ సినిమాల ఫరంగా ఎంత ముందున్నారో… వివాదాల పరంగా కూడా అంతే ముందు ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో… సక్సెస్ మీటింగ్లోనైన బాలకృష్ణ మహిళల గురించి పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుసంచలనం సృష్టించాయి..
తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ అంజలిని స్టేజీపైనే నెట్టేయడం ఇలా ఒకటేమిటి సినిమాల సక్సెస్ రేటు ఎంతగా ఉంటుందో అదే స్థాయిలో వివాదాల రేటు కూడా అంతే ఉంటది. అయితే బాలకృష్ణ గురించి మాత్రం ఓ హాట్ బ్యూటీ క్లీన్ చిట్ ఇచ్చింది. అది మాములు చిట్ కాదు.
బాలకృష్ణతో ప్రస్తుతం NBK 109 మూవీలో నటిస్తున్న ఊర్వశీ రౌతేలా క్లీన్ చిట్ ఇచ్చింది. బాలయ్య గురించి నటి ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ ” బాలకృష్ణ గారి గురించి బయట జరుగుతున్న ప్రచారానికి సినిమా సెట్ లో అతని ప్రవర్తనకు పూర్తి విభిన్నంగా ఉంది.
బాలకృష్ణ గారు పక్కా ప్రోఫెషనల్.. వారితో వర్కు చేస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాలేదు.. సాటి నటులు ముఖ్యంగా నటీమణులంటే వారికి ఎంతో గౌరవమో. తాను వస్తారు సీన్ లో నటిస్తారు వెళ్తారు తప్పా నటిమణులతో కానీ నటులతో కానీ వివాదస్పదంగా ప్రవర్తించరని తేల్చి చెప్పారు.