కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే..
మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు..
మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆయన అన్నారు.