అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ శోభత పెళ్లి ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో నాగ చైతన్య, శోభిత పెళ్లి వచ్చే నెల డిసెంబర్ 4న జరగనుంది. ఎలాంటి ఆడంబరం లేకుండా వేడుక జరగనుండగా, వారిద్దరే దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు.
అయితే వీరిద్దరి కుటుంబసభ్యులు అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని నిర్ణయించినట్లు చైతూ తెలిపారు. ఆ స్టూడియోలో దివంగత నటుడు.. చైతూ వాళ్ల తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉంది.
ఆ విగ్రహాం ముందు తమ పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్గా అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు చెప్పారు.శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు చైతన్య ఈ సందర్భంగా వివరించారు