కిడ్నీలు బాగుండాలంటే..?

 కిడ్నీలు బాగుండాలంటే..?

కిడ్నీలు బాగుండాలంటే ఇవి తినండి:-

  • మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆపిల్, బెర్రీలు, క్యాబేజీ, సోయా, పప్పుధాన్యాలు, చీజ్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • చేపలు, చికెన్, గుడ్లు వంటివి మితంగా తీసుకోవాలి.
  • పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ వంటివి తినాలి.
  • బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలకు మేలు చేస్తాయి.
  • కొవ్వు తొలగించిన పాలను, పెరుగు, చీజ్, బ్రౌన్ రైస్, ఓట్స్ తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి అతిగా వద్దు:-

  • అరటి పండ్లు, పుల్లని పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలను అతిగా తీసుకోవడం మంచిదికాదు.
  • ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, నిల్వ పచ్చళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి మాత్రపిండాలకు హాని చేస్తాయి.
  • చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహార పదార్థాలను తినడం చాలా వరకు తగ్గించడం ఉత్తమం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *