గేమ్ ఛేంజర్ మూవీకి బిగ్ షాక్..!

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం గేమ్ ఛేంజర్. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలో నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న సంక్రాంతి పండక్కి విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ టాక్ ను సోంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దీనికి నిర్మాత దిల్ రాజునే.
అయితే గేమ్ ఛేంజర్ కంటే సంక్రాంతి కి వస్తున్నాం మూవీ బాగుందని టాక్ విన్పించడంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో కొంతమంది థియోటర్ల యాజమాన్యం గేమ్ ఛేంజర్ స్థానంలో సంక్రాంతి కి వస్తున్నాం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని సినీ జర్నలిస్టులు ఫిల్మ్ నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.
