జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ -పోలీసులకు హైకోర్టు బిగ్ షాక్
జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన కుటుంబ విందు పార్టీని రేవ్ పార్టీగా… డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించేందుకు ఇటు అధికార కాంగ్రెస్ .. అటు బీజేపీ పార్టీలతో పాటు కొన్ని మీడియా సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.. దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు కల్సి చేసుకునే విందు పార్టీకి కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అటు పోలీసుల అనుమతి కావాలంటే ఎలా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో పోలీసులకు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బిగ్ షాకిచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో నోటీసులు ఇచ్చినందుకు పోలీస్ విచారణకు హజరయ్యేందుకు రెండు రోజులు గడవు కావాలని రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ కు నోటీసులిచ్చిన రెండు గంటల్లోనే విచారణకు హాజరు కావాలంటే ఎలా అని హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ ను ప్రశ్నించింది.. ఆ నోటీసులపై రాజు పాకాల స్పందించేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. పోలీస్ విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాల కు కోర్టు రెండు రోజులు గడవు ఇచ్చింది. అప్పటివరకు పిటిషనర్ ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయద్దని హూకుం జారీ చేసింది.