మంత్రి రోజాకు బిగ్ షాక్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగరి అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన మంత్రి ఆర్కే రోజాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బిగ్ షాక్ తగిలింది.
ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో మంత్రి ఆర్కే రోజా వెనకబడి ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీనుండి పోటి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.