టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అధికార కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అయిన బీజేపీ ఎదిగే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో ఉన్న మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు కూడా చేసే అవకాశం ఉంది.ఇక్కడ బీజేపీ ఎదగడానికి జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవిలే ప్రధాన అస్త్రంగా కమలం ఉపయోగించుకునే అవకాశం ఉంది..ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తోంది.
ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహం అమలు చేస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు,ఎంపీలు బీజేపీలో చేరిన అదనంగా వచ్చే ఉపయోగం లేదు.వైసీపీ ఓటరు కానీ,వైసిపి నాయకులు కానీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తో కనెక్ట్ అవ్వడం వల్ల వైసీపీ ఓటింగ్ కి వచ్చిన ఇబ్బంది లేదు..టిడిపి కూటమిలో ఉన్న జనసేన,బీజేపీ ఎదగడానికి ప్రయత్నం చేస్తే అది టిడిపి కూటమికి నష్టం తప్ప..వైసీపీకి కాదు.
వైసీపీకి సంప్రదాయంగా ఉన్న ఓటింగ్ 40% జగన్ తో ఉండటం,ప్రాంతీయ పార్టీలకు అధికారం లేనప్పుడు ఓడిదిడుకులు సర్వ సాధారణం..టిడిపి నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి,ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకొని టీడీపీని కాపాడుకున్న విషయం తెలిసిందే..గతంలో టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి చక్రం తిప్పారు..వైసీపీకి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి కూటమికి ఎంపీ సీట్లు దక్కేలా చేస్తున్నారు.
బీజేపీ ఎదిగితే వైసీపీకి నష్టం,వైసీపీ అంతరించి పోతుంది అనుకోవడం ఒక భ్రమ.కాంగ్రెస్ పార్టీని డీ కొట్టినట్టు జగన్ బీజేపీని డీ కొట్టలేరు అనుకోవడం సహజం..రాజకీయాలలో ఒక్కోసారి మౌనం కూడా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు..టిడిపి కూటమిలో ఉన్న బీజేపీ ఎదిగిన లేక జనసేన ఎదిగిన జగన్ మోహన్ రెడ్డికి కొత్తగా వచ్చే నష్టం లేదు.జగన్ తో నడిచే కొన్ని వర్గాలు జగన్ మోహన్ రెడ్డితో కొనసాగుతున్నాయి..
