తెలంగాణలో 45రోజుల్లో బీజేపీ ప్రభుత్వం..!

Shock for Telangana BJP..!
అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది.
మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన ప్రముఖ సీనియర్ నటుడు దివంగత కృష్ణంరాజు జయంతి వేడుకల్లో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉండటం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.పక్కా నలబై ఐదు రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. మరి ఎలా.. ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో మరి వివరించలేదు..౧
