పవన్ కు ఢిల్లీ పిలుపు- బీజేపీ మార్క్ గేమ్..!!

ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. పవన్ అంగీకరిస్తే రెండు రోజుల్లో రాజకీయంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
పవన్ తో మంత్రాంగం :-
ఏపీలో ఎదగటానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఢిల్లీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ లో కీలక నేత విజయ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పటం వెనుక అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి తరువాత మరో ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారు. వీరు బీజేపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. అధికారిక నిర్ణయమే మిగిలి ఉంది. ఇక, సాయిరెడ్డికి 2028 వరకు ఎంపీగా రాజ్యసభలో పదవీ కాలం మిగిలి ఉంది. ఈ సీటు కూటమికే దక్కనుంది. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
బీజేపీ మెగా స్కెచ్ :-
అయితే, ఏపీలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ నాయకత్వం మెగా బ్రదర్స్ వైపు చూస్తోంది. ఇందు కోసం పవన్ తో మైత్రి కొనసాగిస్తూనే.. పవన్ ముందు కీలక ప్రతిపాదనలు చేస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహం అమలు చేస్తోంది. చిరంజీవికి ఇప్పటికే బీజేపీ తమ ఆఫర్ ఏంటో స్పష్టం చేసినా.. ఇంకా మెగాస్టార్ నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో, ఇప్పుడు ఏపీ రాజకీయాల పైన పవన్ పైనే ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది.
బీజేపీ ఆపరేషన్ ఏపీ :-
ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏర్పడే ఖాళీలు బీజేపీ ఖాతాలో వెళ్లేలా ఢిల్లీ నేతలు పట్టు బిగిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబుకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన బీజేపీ నాయకత్వం.. తాజాగా ఢిల్లీ కేంద్రంగా పవన్ తో మంత్రాంగం చేయనుంది. జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో జనసేనకు కేటాయించే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కు బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా ఏపీలో వారి లక్ష్యం ఏంటో స్పష్టం అవుతోంది. తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ తమ టార్గెట్ ఏంటే తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నవేళ పవన్ తో ఢిల్లీ కేంద్రంగా జరిగే మంత్రాంగం పై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతోంది.
