ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్
సిద్దిపేట – చేర్యాల మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన చింతల చందు(24) అనే యువ రైతుపై, భూవివాదంలో నేను పిలిస్తే పోలీస్ స్టేషన్‌కు రావారా లం*కొడకా, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టిన కానిస్టేబుల్ కరుణాకర్.
అడ్డు వచ్చిన తల్లిని నువ్వు ఎవతివే మధ్యలో అంటూ, నాది బైరాన్ పల్లి గ్రామం, మీ గ్రామం మీద నుండే పోతా, నీ కొడుకు ఎలా బ్రతుకుతాడో చూస్తా అంటూ మహిళ అని చూడకుండా బూతులు తిట్టిన కానిస్టేబుల్ కరుణాకర్.
కానిస్టేబుల్‌తో తనకు ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించి, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చందు